యువతి ఆత్మహత్య కేసులో ఏడుగురి రిమాండ్


Fri,June 14, 2019 04:06 AM

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: కొరట్‌పల్లిలో ఈ నెల 4న లొక్కిడి అఖిలేష్ ఇంటి ఎదుట ఇందల్వాయి మండలం సిర్నాపల్లికి చెందిన సొప్పరి సుజాత ఆత్మహత్య ఘటనలో బాధ్యులైన ఏడుగురిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. అఖిలేష్ సిర్నాపల్లికి చెందిన సుజాతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు తెలియకుండానే నిజామాబాద్‌కు చెందిన ఎర్ర మౌనికను పెళ్లి చేసుకున్నాడు. దీంతో సుజాత అఖిలేష్ ఇంటి ఎదుట క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ సమయంలో గ్రామస్తులు ఎవరూ సుజాతను దవాఖానకు తరలించకపోవడంతో నడిపల్లి గ్రామంలో ఉన్న సుజాత అక్క రుద్రబోయిన సవిత స్కూటీపై కొరట్‌పల్లికి వచ్చి సుజాతను నగరంలోని హోప్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో అఖిలేష్‌తో పాటు అఖిలాష్ భార్య, తల్లి లొక్కిడి అనిత, స్నేహితులు నాయుడు ప్రశాంత్, చెమ్మేటి నవీన్, చాపల సాయన్న, చెమ్మేటి చిరంజీవిపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఏ3, ఏ4గా ఉన్న బొంబాయి వనజ, లొక్కిడి అభిలాష్‌ను విచారించాల్సి ఉందని సీఐ తెలిపారు. అభిలాష్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. అఖిలేష్ సోదరి, బొంబాయి వనజ ప్రమేయం ఎంతవరకు ఉందో విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. మృతురాలి అక్క రుద్రబోయిన సవిత ఫిర్యాదు మేరకు 417, 420, 376, 306, ఆర్‌డబ్ల్యూ 90, 109 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. సమావేశంలో ఎస్సై నవీన్‌కుమార్ ఉన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...