బడిగంట మోగింది


Thu,June 13, 2019 03:42 AM

ఇందూరు: వేసవి సెలవుల అనంతరం బుధవారం పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. జూన్ 1న ప్రారంభం కావాల్సిన పాఠశాలలు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జూన్ 12న ప్రారంభించారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు తీసుకొచ్చారు. ఉదయం నుంచి ఆయా పాఠశాలల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడిగా మారింది. విద్యా సంవత్సరం ఆరంభం రోజు చాలా మంది తమ పిల్లలను పాఠశాలలకు తీసుకురావడానికి ఆసక్తి కనబర్చారు. రోడ్లపై ప్రైవేటు పాఠశాలల వాహనాలు దర్శనమిచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల సందడి నెలకొంది. తొలి రోజు ఆయా పాఠశాలల్లో విద్యార్థులు మళ్లీ తరగతి గదుల్లో పాఠాలు వింటూ కనిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 14 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బడి బాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లాలోని సుమారు 2000 ప్రభుత్వ, 600 ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. వేసవి సెలవుల్లో దాదాపు రెండు నెలల పాటు బోసిపోయిన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో పిల్లలు, ఉపాధ్యాయులతో కళకళలాడాయి.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...