గురుకుల పాఠశాల పరిశీలన


Thu,June 13, 2019 03:40 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: మండలంలోని రాంపూర్ గ్రామంలో ఈనెల 17న ప్రారంభం కానున్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను బుధవారం ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన బీసీ గురుకులాలు ఈనెల 17న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో వీజీగౌడ్ గురుకుల పాఠశాలలోని ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, డైనింగ్ హాళ్లు, వసతి ఏర్పాట్లను ఈ నెల 16 నాటికి పూర్తి చేయాలని జిల్లా కన్వీనర్ తిరుపతిని ఆదేశించారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాల, సహకార సంఘం, గంగపుత్ర సంఘం, కమ్యూనిటీ హాల్ భవనాలను గురుకుల పాఠశాలకు కేటాయించారు.

ఈనెల 17న ఎమ్మె ల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్ చేతుల మీదుగా గురుకుల పాఠశాలను ప్రారంభించనున్నారు. అదేరోజు నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, రెవెన్యూ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా వీజీగౌడ్ మాట్లాడుతూ.. మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో గ్రామంలో కోటి రూపాయలతో వృద్ధాశ్రమం, రూ.15 కోట్లతో నాగ్‌పూర్ గేట్ నుంచి తిర్మన్‌పల్లి వరకు బీటీ రోడ్డు, గురుకుల పాఠశాలను మంజూరు చేసుకోవడం జరిగిందని అన్నారు. ఆయన వెంట సర్పంచ్ పాపాయి తిరుపతి, ఉపసర్పంచ్ రమేశ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఒడ్డెం నర్సయ్య, మిట్టపల్లి ఎంపీటీసీ బాలగంగాధర్, పంచాయతీ కార్యదర్శి ఎంబడి నరేశ్, ఎంపీటీసీ పోతర్ల సుజాత, వీడీసీ చైర్మన్ కాయితి రాజ్‌కుమార్, నాయకులు కుమ్మరి గంగాధర్, ఆసది ప్రమోద్, రవి, సురేశ్, చిన్న బాలయ్య, నరేశ్, శ్రీకాంత్, సాగర్, రాజేందర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...