టీఆర్‌ఎస్ పటిష్టతకు కృషి


Thu,June 13, 2019 03:40 AM

బోధన్, నమస్తే తెలంగాణ : మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఇచ్చిన స్ఫూర్తితో ఆమె మార్గదర్శకంలో బోధన్ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు తామంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని టీఆర్‌ఎస్ బోధన్ నియోజకవర్గం నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, రైతు సమన్వయ సమితి బోధన్ మండలం అధ్యక్షుడు బుద్దె రాజేశ్వర్ స్పష్టం చేశారు. బోధన్ పట్టణం లోని ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ నివాసగృహంలో బుధవారం జరిగిన విలేకరుల సమా వేశంలో వారు టీఆర్‌ఎస్ నాయకులు పి.రవికిరణ్, వీఆర్ దేశాయ్, ఆబిద్ అహ్మద్ సోఫి, బోధన్ ఎంపీపీ వైస్ చైర్మన్ కోట గంగారెడ్డితో కలిసి మాట్లాడారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బోధన్ నియోజకర్గంలో కవితకు మెజార్టీ వచ్చిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే షకీల్ కృషితో పాటు ప్రజలు చూపిన ఆదరాభిమానాలే ఇందుకు కారణమన్నారు.

ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఘన విజయం చేకూర్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఢిలీల్లో మోదీ, రాహూల్‌గాంధీల మధ్య పోటీ అంటూ స్థానికంగా వారి రెండు పార్టీలు ఏకం కావడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఎంపీపీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్, బీజేపీ సభ్యులు కొన్ని చోట్ల ఏకంకావడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. బోధన్ ఎంపీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేకపోయినప్పటికీ, తమ పార్టీ ఎంపీటీసీ సభ్యుల్లో చిచ్చుపెట్టి లబ్ధిపొందాలనుకున్నారని టీఆర్‌ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు. వారి కుట్రలను తమ పార్టీ ఎంపీటీసీ సభ్యులు భగ్నం చేయగా, మెజార్టీ సభ్యులున్న టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీపీ పీఠం కైవసం చేసుకుం దన్నారు. ఇలా మెజార్టీ సభ్యులున్న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీపీ చైర్మన్‌గా గెలవ డాన్ని అప్రజాస్వామికమంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు జి.శ్యామ్‌రావు, సాలూర షకీల్, వెంకట్‌రెడ్డి, పోతారెడ్డి, ఎంపీటీసీలు హన్మంతు, బొందుల వెంకటేశ్, ప్రభాకర్, భవానీపేట్ సర్పంచ్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...