రూ.642 కోట్ల ధాన్యం సేకరణ


Thu,June 13, 2019 03:39 AM

నిజామాబాద్ సిటీ: జిల్లాలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన డబ్బు చెల్లింపులు కొనసాగుతున్నాయి. విడతల వారీగా రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. జిల్లాలో యాసంగి(రబీ) 2018-19 సీజన్‌కు సంబంధిం చి 295 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రూ.642,53,95,564 విలువైన 3,64,012.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 64,265 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. అధికారులు కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలు రూ.563,75,06,176 విలువ గల 3,19,880,480 మెట్రిక్‌టన్నుల ధాన్యం 51,508 మంది రైతుల వివరాలతో ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇప్పటి వరకు రూ.453, 08,99,900 విలువైన 2,57,159.160 మెట్రిక్‌టన్నుల ధాన్యం 42,612 మంది రైతులకు సంబంధించిన చెల్లింపులు జరిగాయి. మిగతా రూ.110,66,06,276 విలువైన 62721.320 మెట్రిక్‌టన్నుల ధాన్యానికి సంబంధించి 11,652 మంది రైతులకు చెల్లింపు చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అధికారులు కొనుగోలుకు సంబంధించిన డబ్బులు వీలైనంత త్వరగా మిగిలిన రూ.78,78,89,388లు 44,131.800 మెట్రిక్‌టన్నులకు సంబంధించి 1,105 రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లింపు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఎప్పటికప్పుడు చెల్లింపు చేస్తున్నం..
జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి ధాన్యం సేకరణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశము. సేకరణకు సంబంధించిన పక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. విడతల వారీగా డబ్బులు చెల్లిస్తున్నాం. త్వరలోనే మిగిలిన రూ.78 కోట్లను రైతులకు చెల్లిస్తాం.
- హరికృష్ణ, సివిల్ సప్లయ్ నిజామాబాద్ మేనేజర్

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...