నివాస గృహాల్లోకి దూసుకెళ్లిన లారీ


Thu,June 13, 2019 03:39 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : మండలంలోని 44వ నంబర్ జాతీయ రహదారి న్యాకతండా వద్ద ఉదయం హైవే పక్కనున్న నివాస గృహాల్లోకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మూ డు ఇండ్లు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్తున్న లారీ ఉదయం 6 గంటల ప్రాంతంలో అదుపుతప్పి ఇండ్లలోకి దూసుకెళ్లింది. దీంతో తండాకు చెందిన మాలావత్ గోపి, మాలావత్ గంగరాజం, జ్యోతిసిం గ్, బూక్య అంబర్ ఇండ్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం సంభవించలేదు. జాతీయ రహదారిపై ఇరువైపులా జాలీ లు ఏర్పాటు చేయాలని తండావాసులు నవయుగ కంపెనీ అధికారులకు, నేషనల్ హైవే అ థారిటీ ఆఫ్ ఇండియా వారికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని తండా వాసు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ప్ర మాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ప్ర మాదంలో రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని బాధితులు విన్నవించారు. నవయుగ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, తమకు పరిహారం అందించాలని వారు కోరుతున్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...