స్కూల్ బస్సు.. 62 శాతమే ఫిట్


Wed,June 12, 2019 03:13 AM

నిజామాబాద్ క్రైం : జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల బస్సులకు తప్పని సరిగా ఫిట్‌నెస్ చేయించుకోవాలని రవాణా శాఖ అధికారులు గత నెలలో అన్ని విద్యా సంస్థల యాజమాన్యలకు ఉత్తర్వులు జారీ చేశారు. మే 16వ తేదీ నుంచి 31వ తేదీలోపు అన్ని విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులకు ఫిట్‌నెస్ ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని పేర్కొన్నారు. 15 రోజుల గడువులో విద్యా సంస్థల వాహనాల్లో కేవలం 25 శాతం మాత్రమే ఫిట్‌నెస్ పరీక్షలకు తెచ్చారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో జూన్ 1వ తేదీన ప్రారంభం కానున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం జూన్ 11వ తేదీ వరకు సెలవులు పొడిగించింది. దీంతో విద్యాసంస్థల యాజమాన్యాలకు బస్సుల ఫిట్‌నెస్ చేయించుకోవడానికి మరో 11 రోజుల సమయం కలిసివచ్చింది. ఈ ఫిట్‌నెస్ గడువు కూడా మంగళవారంతో ముగిసిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ ప్రక్రియ సోమవారం రాత్రి వరకు పరిశీలిస్తే 62 శాతం మాత్రమే పూర్తి అయినట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు.

488 బస్సులకు ఫిట్‌నెస్ పూర్తి..
జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సంబంధించి 785 వాహనాలు ఉండగా.. అందులో 488 బస్సులు రవాణా శాఖ ఉత్తర్వుల మేరకు తమ ఫిట్‌నెస్ పూర్తి చేసుకున్నాయి. సోమవారం వరకు జిల్లాలో 297 బస్సులకు ఫిట్‌నెస్ కాలేదని రవాణా శాఖ రికార్డుల్లో ఉంది. మొత్తంగా 62 శాతం ఫిట్‌నెస్ మాత్రమే పూర్తయిందని, ఇంకా 38 శాతం ఫిట్‌నెస్ జరగాల్సి ఉందని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...