నేటి నుంచి గురుకుల విద్యాలయాలు ప్రారంభం


Wed,June 12, 2019 03:12 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ/శక్కర్‌నగర్/ మోపాల్ : నిజామాబా ద్, కామారెడ్డి, నిర్మల్ జి ల్లాల్లోని తెలంగాణ సాం ఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు విద్యాసంవత్సరం 2019-20కి సంబంధించి బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయని గురుకుల పాఠశాలల రీజినల్ కో-ఆర్డినేటర్ సింధు తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల ల్లో రిపోర్ట్ చేయాలన్నారు. లేకుంటే తర్వాత రోజు నుం చి పాఠశాలలోకి అనుమతించబడరని ఆమె తెలిపారు. పాఠశాల ప్రారంభం రోజున రిపోర్ట్ చేయని విద్యార్థుల సీట్లను రద్దు చేయడంతో పాటు బ్యాక్‌లాగ్ ద్వారా పరీ క్ష రాసిన వారికి సీటు కేటాయిస్తామన్నారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలన్నారు.

నేటి నుంచి గురుకులాల పునఃప్రారంభం
జిల్లాలోని అన్ని బాల బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయని ప్రిన్సిపాల్ సంగీత తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల ప్రారంభం రోజే చేర్పించాలని లేనియెడల పాఠశాలలోకి అనుమతించబోమని ఆమె పేర్కొన్నారు. 13వ తేదీ తర్వాత వచ్చే తల్లిదండ్రులు స్థానిక ఆర్‌సీ కార్యాలయం ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వారం రోజులు ఆలస్యంగా వచ్చే విద్యార్థులు హైదరాబాద్‌లోని సెక్రెటరీ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సరైన కారణం లేకుండా 10 రోజులు దాటితే అడ్మిషన్ రద్దు చేస్తామని, వారి స్థానంలో బ్యాక్‌లాగ్ సీట్ల కోసం పరీక్ష రాసిన వారితో భర్తీ చేస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.

బోధన్ పట్టణం శక్కర్‌నగర్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న వి ద్యార్థులను బుధవారం తప్పక పాఠశాలకు తీసుకురావాలని సదరు పాఠశాల ప్రిన్సిపాల్ చక్రపాణి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం పాఠశాలకు హాజరు కాని పక్షంలో ధర్మారంలోని ప్రాంతీయ సమన్వయ అ ధికారి అనుమతి పొందాల్సి ఉంటుందని, వారం త ర్వాత విద్యార్థులను చేర్చాలనుకుంటే హైదరాబాద్‌లోని సెక్రటరీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంద ని ఆయన సూచించారు.
విద్యార్థులు బుధవారం పాఠశాలకు తప్పని సరిగా హాజరు కావాలని బాలికల గురుకుల సంక్షేమ పాఠశా ల ప్రిన్సిపాల్ మాధవిలత ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. పాత విద్యార్థులు, కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ 12వ తేదీ నుంచే పాఠశాలల్లో చేరాలని ఆమె తెలిపారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...