బీటీ రోడ్డు శాంపిళ్లు సేకరించిన అధికారులు


Wed,June 12, 2019 03:12 AM

లింగంపేట : కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రోడ్లు భ వనాల శాఖ అధికారులు బీటీ రోడ్డు శాంపిళ్లు సేకరించారు. కరీం నగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి రహదారి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు విడుదల చేయగా 12 కిలో మీట ర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పనులు పూర్తి కావడంతో సంబంధిత శాఖ అధికారులు నాణ్యతా ప్రమాణాలు తనిఖీలు చేయడానికి బీటీ రోడ్డు శాంపిళ్లు సేకరించారు. కిలో మీటరు పరిధిలో రెండు చోట్ల శాంపిళ్లు సేకరిస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ ఏఈ రవితేజ వెల్లడించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...