విద్యాభివృద్ధికి సర్కారు పెద్దపీట


Wed,June 12, 2019 03:12 AM

ఇందూరు: బీసీల ఆర్థిక సామాజికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో కొత్తగా ఆరు బీసీ గురుకులాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అన్ని జిల్లాల్లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఈనెల 17న జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యేలు లాంఛనంగా వీటిని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలుండగా ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వీటి సంఖ్యను 142కు పెంచింది. కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 119 బీసీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలో ఆరు కొత్త గురుకులాలు ఏర్పాటు కానున్నాయి. తద్వారా బీసీ విద్యార్థుల విద్యా ప్రగతికి ప్రభుత్వం చొరవ చూపుతోంది.

ప్రభుత్వ నిర్ణయం భేష్..
తెలంగాణలోని బీసీల విద్యా ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు హర్షించారు. విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుతంగా ఉందన్నారు. మౌలిక వసతులన్నీ కల్పించడంతో పాటు నాణ్యమైన విద్య, వసతి, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ కొత్తగా జిల్లాకు ఆరు గురుకులాలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. విద్యా రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...