వలస బాధితురాలికి టీఆర్‌ఎస్ నాయకుల సంఘీభావం


Wed,June 12, 2019 03:11 AM

నిజామాబాద్ రూరల్ : తన భర్త రాజసన్ని కూలీ పని చేసినందుకు రావల్సిన కూలీ బకాయి డబ్బులు ఇవ్వాలని కోరుతూ రేఖ అనే మహిళ తన పిల్లలు, బంధువులతో కలిసి మండలంలోని పాల్దా గ్రామశివారులో ఉన్న ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఎదుట రెండురోజులుగా చేపడుతున్న నిరసన దీక్షకు పాల్దా గ్రామ పెద్దలు, టీఆర్‌ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. బాధిత పేద కుటుంబానికి ఇవ్వాల్సిన కూలీ డబ్బులు ఇచ్చి న్యాయం చేయాలని వారు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు టీఆర్‌ఎస్ నాయకుల డిమాండ్ మేరకు ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించింది. మంగళవారం సాయంత్రం టీఆర్‌ఎస్ నాయకులతో ఫ్యాక్టరీ యాజమాన్యం సంప్రదింపులు జరిపింది. చివరికి బాధిత కుటుంబానికి రూ.85వేల నగదు ఇస్తామని యాజమాన్యం అంగీకరించింది. దీంతో యాజమాన్యం ఇచ్చిన 85వేల రూపాయల నగదును బాధితురాలు రేఖకు టీఆర్‌ఎస్ నాయకులు అందజేశారు. నిరుపేద బాధిత కుటుంబానికి అండగా నిలిచి రావల్సిన కూలీ డబ్బులు ఇప్పించిన టీఆర్‌ఎస్ నాయకులకు బాధితురాలితో పాటు ఆమె బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుప్రియ నవీన్ యాదవ్, ఎంపీటీసీ నరేశ్, ఉపసర్పంచ్ జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు దేవన్న, వీడీసీ సభ్యులు రాంరెడ్డి, మురళి, యూత్ నాయకులు నరేశ్, సచిన్, సతీశ్, కిరణ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...