కొనసాగుతున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు


Wed,June 12, 2019 03:11 AM

ఇందూరు: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండో రోజు మంగళవారం కొనసాగాయి. ఈ నెల 24వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పది పరీక్షలకు మానిక్ భవన్ స్కూల్, కోటగల్లీలోని గవర్నమెంట్ హై స్కూల్, ఆర్మూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల (బాలుర), బోధన్‌లో రాకాసీపేట్‌లోని గవర్నమెంట్ హై స్కూల్ నందు సెంటర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పేపర్-2కు 186 విద్యార్థులకు గాను 119 మంది హాజరయ్యారు. 67 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. డీఈవో రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలకు ఏర్పాటుచేసిన నాలుగు సెంటర్లలో మాల్‌ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. ప్లయింగ్ స్కాడ్స్ నాలుగు సెంటర్లను తనిఖీ చేశారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...