మొక్కలు ఎండిపోకుండా చూడాలి


Wed,June 12, 2019 03:11 AM

-నర్సరీని తనిఖీ చేసిన డీఆర్‌డీవో
డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: మండలంలోని నర్సరీలను మంగళవారం డీఆర్‌డీవో రమేశ్ రాథోడ్ తనిఖీ చేశారు. మండలంలోని బర్ధిపూర్, ఆరేపల్లి, నడిపల్లి, నర్సింగపూర్, మిట్టపల్లి, మిట్టపల్లి తండా, సాంపల్లి, సాంపల్లి తండా నర్సరీలను సందర్శించి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కలను ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటి వాటిని పెంచాలన్నారు. హరితహారం నాటికి అన్ని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సిద్ధం చేయాలని ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. సాంపల్లి తండా నర్సరీని పరిశీలించి అక్కడి సిబ్బందిని అభినందించారు. క్షేత్రస్థాయిలో నర్సరీల పనితీరును ఏపీవోలు, టీఏలు ఎప్పటికప్పుడు సందర్శిస్తూ మొక్కలను కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందించాలన్నారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే క్షేత్రస్థాయిలో సిబ్బందిని వాటిని సరిచేసుకొని మొక్కల పెంపకంలో జాగ్రత్తపడాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో మర్రిసురేందర్, ఏపీవో మంజుల, టెక్నికల్ అసిస్టెంట్లు మోతిరాం, రాజేశ్వర్, సంపూర్ణ, వినోద, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...