యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం


Wed,June 12, 2019 03:11 AM

నిజామాబాద్ సిటీ: ప్రతి ఒక్కరూ రోజూ యోగాసనాలు వేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ హరిబాబు అన్నారు. మంగళవారం నగరంలోని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ కేంద్రంలో ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో యోగా పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థులు తప్పనిసరిగా ప్రతి రోజూ యోగా చేయాలని కోరారు. మానసిక ఒత్తిడి నుంచి రక్షించుకునేందుకు యోగా అత్యున్నతమైన మార్గమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి 2014లో జూన్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ప్రకటించిందని తెలిపారు. మన సంస్కృతిలో భాగమైన యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయాలని కోరారు. యోగా వలన మానసిక జీవనశైలి వ్యాధులు రాకుండా నియంత్రించ వచ్చని అన్నారు. యోగాసనాలు సాధన చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు ఉత్తేజితం అవుతాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు యోగాపై వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. సదస్సులో జిల్లా ఆయూష్ విభాగం ఇన్‌చార్జి డాక్టర్ రమణమోహన్, నెహ్రూ యువ కేంద్రం జిల్లా సమన్వయ కర్త రాంచంద్రరావు, డాక్టర్ తిరుపతి, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ కేంద్రం డైరెక్టర్ వాసుదేవ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...