భూ రికార్డుల శుద్ధీకరణ పూర్తి చేయాలి


Tue,June 11, 2019 02:54 AM

నిజామాబాద్ సిటీ : కోర్టు కేసులు, అనర్హత కేసు లు మినహా భూ రికార్డుల శుద్ధీకరణ కేసులన్నీ పరిష్కరించాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా తహసీల్దార్లతో భూ రికార్డుల శుద్ధీకరణ, ఇతర అంశాలపై సోమవారం మాట్లాడారు. కోర్టు కేసులు, అనర్హత కేసులు తప్ప మిగతా కేసులన్నీ పరిష్కరించాలని ఈ విషయానికి సంబంధించి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నా రు. ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున అధికారులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ఒక్క కేసు కూడా పెండింగ్ లేకుండా పరిష్కరించాలని, అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని ఆదేశించారు. ఇతర దేశాల్లో ఉన్న ఎన్నారైల కేసుల విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన ఆదేశాలు జారీ చేసినందున ఈ విషయమై కూడా ప్రత్యేక చొరవచూపి కేసులు పెండింగ్ లేకుం డా చూడాలన్నారు. ఆర్డీవోలు వారి పరిధిలోని తహసీల్దార్లు పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని, రోజూ వారి నివేదికలు పంపించాలని తెలిపారు. జిల్లాలో 3,23,024 ఖాతాలకు పార్ట్-ఏలో 4శాతం 13,102 పెండింగ్‌లో ఉన్నాయని, పార్ట్ -బీలో 6.25 శాతం 20,186 కేసులు వివిధ మండలాల్లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

ఎన్నికల కోడ్ ముగిసినందున కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెల్లింపులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల మేరకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, వివిధ మండలాల్లో పెండింగ్‌లో ఉన్న ధ్రువపత్రాలను జారీ చేయాలని, సమయం తర్వాత పెండింగ్‌లో ఉండకూడదని తెలిపారు. వీసీలో ఆర్డీవో శ్రీనివాస్, గోపీరాం, కలెక్టరేట్ ఏవో శ్రీధర్ పాల్గొన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...