శాఖాపరమైన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి


Tue,June 11, 2019 02:53 AM

నిజామాబాద్ సిటీ : ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున అధికారులు వారి శాఖాపరమైన కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిమగ్నమై వారికి కేటాయించిన విధులను సక్రమంగా పూర్తి చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సంఘటనలకు అవకాశం కల్పించకుండా ప్రశాంతగా, ప్రశంసాపూర్వకంగా నిర్వహించగలిగామని అన్నారు. ఎన్నికల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రజలకు అందించడానికి సంబంధిత సిబ్బందిని కార్యోన్ముఖులను చేయాలని, కార్యక్రమాల అమలులో జిల్లా స్థానాన్ని ముందు వరుసలో నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కోరారు. ప్రజా విజ్ఞప్తులను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, డీఆర్డీవో రమేశ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...