నెలాఖరుకల్లా రైతుబంధు చెల్లింపులు


Tue,June 11, 2019 02:53 AM

నిజామాబాద్ సిటీ : బ్యాంకు ఖాతాలు సరిగా ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులను ఈ నెలాఖరుకల్లా ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి తెలిపారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా ఏడు లక్షల ఖాతాలకు రైతులు బ్యాంకు ఖాతా నంబర్లు ఇవ్వలేదని, అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల బంధువులు, వారి మిత్రుల ద్వారా సంబంధిత రైతులకు సమాచారం అందించి ఖాతా నంబర్లు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఖాతాలు సరిగా ఉన్న రైతుల బ్యాంకు అకౌంట్లకు ఈ నెల చివరి కల్లా ఈ(వానాకాలం సీజన్) ఖరీఫ్‌కు సంబంధించి రైతుబంధు మొత్తాలను ఖాతాల్లో జమ చేస్తామన్నారు. రైతుబంధు సాయం వద్దనుకునే రైతులు సంబంధిత ఫారంలో రైతు సమన్వయ సంఘాలకు వారి అంగీకారాన్ని తెలియజేయాలని తెలిపారు. రైతు సమగ్రసర్వే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.

ఖాతా నంబర్లు ఇవ్వని రైతుల వివరాలు సేకరించాం
ఖాతా నంబర్ ఇవ్వని రైతుల వివరాలను ఇప్పటికే సేకరించామని కలెక్టర్ రామ్మోహన్‌రావు తెలిపారు. ఈ జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించామన్నారు. రైతు సమగ్ర సర్వే త్వరగా పూర్తి చేయడానికి అధికారులను ఆదేశించామని తెలిపారు. వీసీలో రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి, డీఆర్వో అంజయ్య, జేడీఏ గోవిందు, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్, డీఆర్డీవో రమేశ్ రాథోడ్ పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...