సిద్ధంగా ఉన్నాం..


Fri,April 19, 2019 02:12 AM

- స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాం..
- ఉన్నతాధికారుల సమావేశంలో కలెక్టర్ రామ్మోహన్‌రావు

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు అన్నా రు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగం గా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల సమావేశానికి జిల్లా నుంచి కలెక్టర్ రామ్మోహన్‌రావు, సీపీ కార్త్తికేయశర్మ, జడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో గోవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ముందస్తు జాగ్రత్తల గురించి ఆరాతీశారు. కావాల్సిన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల నిర్వహణలో కావాల్సిన సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానమిచ్చారు. జిల్లాలో కావాల్సిన బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని, బ్యాలెట్ పత్రాల ముద్రణకు సంబంధించిన ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి అయిందని వివరించారు.

ఓటు వేసే సమయంలో ఏ వేలికి ఇంకు ముద్ర వేయాలనే దానిపై చర్చ రాగా.. ఎడమ చేతి మధ్యవేలికి ఇంకు పెట్టాల్సిందిగా ఆయన సూచించారు. బ్యాలెట్ బాక్సులను మండల ఆఫీసుల్లో గానీ, కౌంటింగ్ కేంద్రాల్లో కానీ ఎక్కుడ అనువుగా ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎంపీటీసీ ఎన్నికకు గులాబీ బ్యాలెట్ ప్రత్రాన్ని, జడ్పీటీసీ ఎన్నికకు తెలుపు బ్యాలెట్ పత్రాన్ని వినియోగించాలని అధికారులు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో అంతా సిద్దంగా ఉండాలని సూచించారు.

మోస్రా, చందూరు జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు..
కొత్తగా ఏర్పడిన మోస్రా, చందూరు మండలాల జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చందూరు జడ్పీటీసీ స్థానం ఎస్టీకి కేటాయించగా, మోస్రా జడ్పీటీసీ స్థానం జనరల్‌కు కేటాయించారు. చందూరు ఎంపీపీ స్థానం ఎస్టీకి, మోస్రా ఎంపీపీ స్థానం మహిళ జనరల్‌కు కేటాయించారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...