బాన్సువాడ దవాఖానకు జాతీయ అవార్డు


Thu,April 18, 2019 12:41 AM

పాత బాన్సువాడ : బాన్సువాడ ఏరియా దవాఖానను జాతీయ అవార్డు వరించింది. ఈ మేరకు జాతీయ కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. 13 అంశాల్లో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు లభించింది. దవాఖాన ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణం కల్పించడం, పేరింగ్ రూంలతో పాటు జనరల్ వార్డులను సైతం కార్పొరేట్ స్థాయిలో నిర్వహించడం, వైద్య, వైద్యేతర సేవలు అత్యుత్తమంగా అందించడం, రోగికి మెరుగైన సేవలు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. గత ఫిబ్రవరిలో జాతీయస్థాయి వైద్య బృందం దవాఖానను పరిశీలించి అవార్డు కోసం కేంద్రానికి సిఫారసు చేసింది. నివేదిక మేరకు మంత్రిత్వశాఖ (నేషనల్ క్వాలిటీ అక్రెడేషన్-ఎన్‌క్యూఏఎస్) అవార్డుకు ఎంపిక చేసింది. మూడంచెల తనిఖీలు జరిపారు. ముందుగా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి బృందాలు పరిశీలనలు జరిపిన తర్వాత డాక్టర్ బీనాదేవి నేతృత్వంలోని జాతీయస్థాయి బృందం పరిశీలనలు చేసింది. ఈ అవార్డు కింద దవాఖానకు సంవత్సరానికి రూ.10 లక్షల చొప్పున మూడు సంవత్సరాల పాటు రూ.30 లక్షలు కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది.

సిబ్బందిని అభినందించిన స్పీకర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 103 ఏరియా దవాఖానలు ఉండగా బాన్సువాడ దవాఖాన నిర్వహణ, అందిస్తున్న వైద్య సేవల గురించి ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ కేంద్ర బృందాన్ని పరిశీలించాల్సిందింగా కోరారు. ఈ మేరకు పరిశీలించిన బృందం నిర్వహణ భేషంటూ కితాబిచ్చింది. దీంతో బాన్సువాడ దవాఖాన తెలంగాణాలోనే అత్యుత్తమంగా నిలిచింది. జాతీయ అవార్డు విషయమై దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ వైద్య సిబ్బంది అందించిన సేవల గురించి రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి వివరించగా దవాఖాన వైద్య సిబ్బందిని అభినందించారు. జాతీయ అవార్డు రావడం, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది, వైద్యేతర సిబ్బంది సమష్టి సహకారంతోనే గత సంవత్సరం కాయకల్ప జాతీయ అవార్డు, నేడు క్వాలిటీ అక్రిడిటేషన్ అవార్డు పొందినట్లు సూపరింటెండెంట్ శ్రీనివాస ప్రసాద్ వివరించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో సూపరింటెండెంట్ శ్రీనివాస ప్రసాద్, దవాఖాన నోడల్ అధికారి విజయ భాస్కర్, వైద్యులు సుధ, స్టాఫ్ నర్స్ అమృత తదితరులు ఉన్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...