మోస్రా, చందూరు రిజర్వేషన్లు ఖరారు


Thu,April 18, 2019 12:41 AM

నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి/వర్ని : కొత్తగా ఏర్పడిన మోస్రా, చందూరు మండలాలకు ఎంపీపీ రిజర్వేషన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మోస్రా ఎంపీపీ స్థానం మహిళా (జనరల్)కు, చందూరు ఎంపీపీ స్థానం ఎస్టీకి కేటాయించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. కలెక్టర్ వీటిపై సంతకాలు చేయాల్సి ఉంది. గురువారం (నేడు) ఈ వివరాలు వెల్లడించనున్నారు. కాగా, ఎంపీటీసీ స్థానాలు ఈ మండలాల పరిధిలోని గ్రామాలకు ఇది వరకు కేటాయించిన రిజర్వేషన్లే వర్తించనున్నాయి. ఇప్పటి వరకు అన్ని ఎంపీపీ స్థానాలు, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. గెజిట్ కూడా విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ రెండు మండలాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఈ నేపథ్యంలో వీటికి రిజర్వేషన్లు ఎలా ?విషయంలో జిల్లా యంత్రాంగం తర్జన భర్జన పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం దీనిపై బుధవారం స్పష్టతనిచ్చింది. ఇప్పటి వరకు చేసిన రిజర్వేషన్లను మార్చకుండా వాటిని యథాతధంగా ఉంచుతూ.. జడ్పీటీసీ స్థానాలకు జిల్లా యంత్రాంగాన్ని రిజర్వేషన్లు చేసుకోవాలని సూచించింది. జడ్పీ అధికారులు రాత్రి వరకు కలెక్టర్ చాంబర్‌లో కూర్చొని ఈ ప్రక్రియ పూర్తి చేశారు. వీటిని ఆమోదముద్ర కూడా పడింది. గురువారం (నేడు) వీటి వివరాలు వెల్లడించున్నారు. నేడు జిల్లా కలెక్టర్, సీపీతో హైదరాబాద్‌లో ఎన్నికల సంఘం సమావేశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆ తర్వాత షెడ్యూల్ విడుదల కానుంది. ఇక గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలుకానుంది.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...