లోక కల్యాణం కోసమే ఆలయాల నిర్మాణం


Thu,April 18, 2019 12:40 AM

బీర్కూర్ : లోక కల్యాణం కోసమే ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని బరంగేడ్గి గ్రామంలో నిర్మించిన హనుమాన్ ఆలయంలో ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన ఆలయ ఉత్సవాలు బుధవారం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. ఈ కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు పోచారం భాస్కర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు స్పీకర్‌కు వేద పండితులు, పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నూతన విగ్రహాలను ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఆలయాన్ని సుందరంగా నిర్మించి, పండుగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

డబుల్ ఇండ్ల నిర్మాణ పనుల పరిశీలన..
బరంగేడ్గి గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను స్పీకర్ పోచారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో వివరించి అర్హులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని టీఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేద ఉండకుండా రెండు పడక గదుల ఇండ్లను నిర్మించి ఇవ్వడమే తన లక్ష్యమని అన్నారు.

కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, సర్పంచ్ పసుపుల లక్ష్మి, ఆర్‌ఎస్‌ఎస్ మండల కోఆర్డినేటర్ ద్రోణవల్లి అశోక్, సొసైటీ చైర్మన్ రాజప్ప, ఏర్వాల కృష్ణారెడ్డి, రమేశ్, గ్రామ పెద్దలు దేవానంద్ దేశాయ్, గణేశ్ రావు పంతులు, ఇందూరి గంగాధర్‌యాదవ్, గైని మారుతి, కుమ్మరి గంగాధర్, లక్ష్మణ్ యాదవ్, పసుపుల రమేశ్, దీపెని సంజీవ్, నాగుగొండ తదితరులు పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...