విద్యుత్తు సమస్యలను పరిష్కరిస్తాం


Wed,April 17, 2019 01:48 AM

ఇందల్వాయి : రైతులు, వినియోగదారులు విద్యుత్తు పరంగా ఏమైనా సమస్యలుంటే వాటిని గ్రామంలో ఉన్న సంబంధిత లైన్‌మెన్లకు గానీ, లైన్ ఇన్‌స్పెక్టర్, ఏఈలకు చెప్పి సమస్యలను పరిష్కరించుకోవాలని ఎన్‌పీడీసీఎల్ చైర్‌పర్సన్ ఎంఎ.షరీఫ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపల్లి సబ్‌స్టేషన్‌లో విద్యుత్తు వినియోగదారులకు, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్తు తీగెల సమస్య ఓవర్‌లోడ్‌తో పాటు నివాసపు ఇళ్లలో వినియోగించిన దాని కంటే అధిక మొత్తంలో బిల్లులు రావడం వాటి విషయాలపై చర్చ జరిపినట్లు పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ విద్యుత్తు పరంగా ఏవైనా సమస్యలుంటే వెంటనే స్థానికంగా ఉన్న విద్యుత్ అధికారులకు సమాచారాన్ని అందించి సమస్యలను నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను అందిస్తోందని, నివాసపు గృహాలకు కూడా రెప్ప పాటు కరెంట్ పోకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, ఆర్‌ఐఎన్‌ఏఎన్‌సీఈ కిషన్, రమణ, డిచ్‌పల్లి ప్రవీణ్, ఎల్లారెడ్డిపల్లి ఏఈ భాస్కర్, నిజామాబాద్ రూరల్ ఏడీ రఘు, ఏఈవో విజయ్‌కుమార్, ఎస్‌బీసీ ఎల్లారెడ్డిపల్లి యోగేశ్, అన్ని సబ్‌స్టేషన్ల ఏఈలు, విద్యుత్తు శాఖ అధికారులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...