పోలీసుల చొరవతో సద్దుమణిగిన వివాదం


Wed,April 17, 2019 01:47 AM

మోర్తాడ్ : మం డలంలోని తి మ్మాపూర్ గ్రా మంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న వివా దం పోలీసుల చొరవతో సద్దుమణిగినట్లయ్యింది. గ్రా మంలో కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తిమ్మాపూర్‌లో నివాసం ఉంటున్న వారు గ్రామ కమిటీలో చేరుతామని గతంలో గ్రామపెద్దలకు తెలుపగా గ్రామంలో ఉన్న నిబంధనల ప్రకారం ఒక వర్గం వారు వినలేదు. దీంతో సమస్య మొదలైంది. ఒకవర్గం వారు మంగళవారం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఎస్సై సంపత్‌కుమార్ ఇరువర్గాల వారితో చర్చలు జరిపి సమస్యను పెంచకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండడంతో ఇరువర్గాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. కొన్ని సమయాల్లో గ్రా మంలో ఇరువర్గాల వారు పంతాలకు పోకుండా సర్దుకుపోవాలన్నారు. గ్రామంలో ప్రశాంతత నెలకొనేలా పోలీసులకు సహకరించాలని, చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకున్న చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల ప్రజలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామని ఎస్సైకి చెప్పి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...