వివాదాస్పద భూములను సర్వే చేసిన అధికారులు


Wed,April 17, 2019 01:47 AM

మాక్లూర్ : మండలంలోని కల్లడి గ్రామంలో మంగళవారం రెవె న్యూ, ఫారెస్ట్ అధికారు లు జాయింట్ సర్వే ని ర్వహించినట్లు తహసీల్దార్ భూపతి తెలిపా రు. 570 సర్వే నంబర్ లో 130 ఎకరాల 26 గుంటల వివాదాస్పద భూమి ఉందన్నారు. ఈ భూమి ఫారెస్ట్‌కు సంబంధించిందని ఫారెస్ట్ అధికారులు, అసైమెంట్ భూమి అని రెవెన్యూ అధికారులు చె ప్పడంతో రెండు శాఖల మధ్య వివాదం మొ దలైందన్నారు. కొన్నేళ్లుగా ఈ సమస్య కొనసాగుతుండడంతో పరిష్కరించుకునే చర్యల్లో భా గంగా మంగళవారం రెండు శాఖలకు చెందిన అధికారులు 570 సర్వే నంబర్‌లో 130.26 ఎకరాల వివాదాస్పద భూమిని సర్వే చేసినట్లు తెలిపారు. బుధవారంతో ఆ భూమి ఎవరిదో తేలిపోతుందన్నారు. ఈ సర్వేలో ఫారెస్ట్, రెవె న్యూ అధికారులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...