జడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగరాలి


Tue,April 16, 2019 01:37 AM

- టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్
- స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నియమాకం
- ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటాం : మంత్రి వేముల

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజ యం సాధించాలని, జడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగరాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ శ్రే ణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో సో మవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్, రవాణా, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎ మ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్‌రావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా కేసీఆర్ ఎన్నికలకు సంబంధించి పార్టీ తీసుకోవాల్సిన విధి విధానాలపై వివరించారు. ప్రజాప్రతినిధులంతా సమష్టిగా కృషి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థానిక సం స్థల ఎన్నికల ఇన్‌చార్జిగా పార్టీ తరపున మంత్రి వే ముల ప్రశాంత్‌రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించా రు.

ఈ సందర్భంగా మంత్రి నమస్తే తెలంగాణ తో మాట్లాడారు. నిజామాబాద్ జడ్పీపీఠాన్ని కైవ సం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. 2001లో ఉద్యమ పార్టీగా ప్రజల అండదండల తో ఎవరి పొత్తూ లేకుండా జడ్పీపీఠాన్ని కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. జడ్పీటీసీ అ భ్యర్థులుగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ కొత్త, పాత కలయికతో అ భ్యర్థుల ఎంపిక జరుగుతుందని అన్నారు. నాయకులందరం కలిసి టీంవర్క్‌గా పనిచేసి సీఎం ఆదేశాల మేరకు జడ్పీపీఠాన్ని కైవసం చేసుకుంటామని, గులాబీ జెండా ఎగరవేస్తామని అన్నారు.

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...