నేడు పాలిసెట్


Tue,April 16, 2019 01:36 AM

ఇందూరు: పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిసెట్-2019ను మంగళవారం నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. జిల్లాలో 5,057 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలో 13 కేంద్రాలను ఎంపిక చేశారు. ఉదయం పది గంటల వరకే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని ఇప్పటికే అధికారులు సూచించారు. 11 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని పేర్కొన్నారు. హాల్ టికెట్ పైన పాస్‌పోర్టు సైజ్ ఫోటో అతికించి గెజిటెడ్ అధికారి లేదా హెడ్ మాస్టర్‌సంతకం తీసుకుని రావాలని సూచించారు.

పరీక్షా కేంద్రాలు ఇవే..
పాలిసెట్ పరీక్ష నిర్వహణ కోసం జిల్లా కేంద్రంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీఎస్‌ఐ డిగ్రీ కళాశాల, సీఎస్‌ఐ జూనియర్ కళాశాల, ఉమెన్స్ డిగ్రీ కళాశాల, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(యూజీబ్లాక్), గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల(పీజీ బ్లాక్), దుబ్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గౌతమీ డిగ్రీ కళాశాల, కేర్ డిగ్రీ కళాశాల, ఎస్‌ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల, ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల, నిశిత డిగ్రీ కళాశాల, ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల(బ్యాంకు కాలనీ), కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్(మానిక్ భండార్)లో ప్రవేశ పరీక్ష నిర్వహణకు కేం ద్రాలను ఏర్పా టు చేశా రు. విద్యార్థులు సెం టర్లకు సకాలంలో చే రుకోవాల ని అధికారులు సూచించారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...