జోరందుకున్న కొనుగోళ్లు


Tue,April 16, 2019 01:35 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: యాసంగి ధాన్యం కొనుగోళ్లు షురూ ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 291 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పీఏసీఎస్ 262, మెప్మా 02, ఐకేపీ 27 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 78 సెంటర్లలో మాత్రమే ధాన్యం సేకరణ జోరుగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1558 మంది రైతులు 14,300 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. వీరికి మద్దతు ధర అందించనున్నారు. గ్రేడ్ -ఏ ధాన్యానికి క్వింటాకు రూ.1,770, కామన్ వెరైటీకి రూ.1750 చొప్పున మద్దతు ధర అందిస్తారు. మొత్తం 3.50 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ తెలిపారు. కాగా.. గత వానాకాలంలో 4.90 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సేకరించి రాష్ట్రంలోనే నంబరవన్ స్థానాన్ని సంపాదించారు. వీటికి మద్దతు ధర కింద రూ. 850 కోట్లను రైతులకు అందజేశారు. తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఇందూరు పేరు మార్మోగింది. గత వానాకాలంలో 55 వేల మంది రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధర పొందారు. మే చివరి నాటికి లేదా జూన్ మొదటి వారంలో ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరో వారం, పది రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని తెలిపారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...