పంట కాలనీలకు అడుగులు


Mon,April 15, 2019 02:18 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: పంట (క్రాప్) కాలనీల కోసం ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని రాబట్టేందుకు సర్వేను నిర్వహించేందు కు రంగం సిద్ధం చేసింది. జనవరిలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. వరుసగా వచ్చిన ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా ప్రభు త్వం నుంచి మళ్లీ ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో వ్యవసాయశాఖ సమాయత్తమైంది. త్వరలో స్థానిక సంస్థల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో వ్యవసాయాధికారులకు ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించవద్దని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. వచ్చే నెల 15 వరకు ఈ సర్వేను పూర్తి చేసి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ సోమవారం నుంచి క్లస్టర్ల వారీ గా రైతుల వివరాలను సేకరించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం పంపిన ఫార్మాట్‌లో వివరాలను పొందుపరచనున్నారు.

రైతు ఆరుగాలం శ్రమించి పండించే పం టలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఎవరికి తోచిన పంట వారు వేసుకొని, తీరా పంట చేతికి రాగానే డిమాండ్ లేక.. గిట్టుబాటు ధర రాక నష్టాల బారినపడి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులను ఈ పరిస్థితి నుంచి విముక్తి కలిగించేందుకు సీఎం కేసీఆర్ సమగ్రమైన వ్యవసాయ ప్రణాళికను రూపొందించారు. మార్కెట్‌లో ధర ఉన్న పంటను రైతులంతా పండిస్తే.. చేతికొ చ్చే సమయానికి మార్కెట్‌లో ఆ పంటకు డిమాండ్ లేక ధర పడిపోతున్నది. దీంతో ఆ పంటను రైతు అగ్గువ సగ్గువకు అమ్ముకునే పరిస్థితి నిత్యం కనిపిస్తూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పలు రైతు సమావేశాల్లో ఈ విషయాలపై చాలాసార్లు మాట్లాడారు. ఇకపై ఆ పరిస్థితి ఉండవద్దని క్రాప్ కాలనీలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏ ప్రాం తంలో ఏ పంటకు అనువైన నేల, వాతావరణం అనుకూలంగా ఉంటుందో, ఆ మేరకే పంటలు వేసుకొని మా ర్కెట్‌లో డిమాండ్‌ను సృష్టించి గిట్టుబాటు ధరను పొం దే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇ ప్పుడు ఆ విధానానికి కార్యాచరణ రూపొందుతున్నది. ప్రభుత్వం నుంచి జిల్లా వ్యవసాయశాఖకు క్రాప్ కాలనీల ఏర్పాటుకు సంబంధించిన అంశంపై సర్వే చేపట్టాల్సిందిగా సంకేతాలు అందాయి. త్వరలో దీనికి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవన శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీవో), జిల్లా పరిశ్రమల శాఖ (డీఐసీ), రైతు సమన్వయ సమితి సభ్యులు సంయుక్తంగా ఈ సర్వేలో పా ల్గొంటారు. రైతులతో చర్చించి ప్రాంతాల వారీగా పంట ల వివరాలను సేకరించనున్నారు. అక్కడి వాతావరణం పరిస్థితులను అంచనా వేయనున్నారు. ప్రభుత్వం పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధంగా ఉండడంతో పాటు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చే స్తున్నది.

ఈ క్రమంలో క్రాప్ కాలనీల సర్వే కూడా దీనికి కీలకం కానుంది. వానాకాలం (ఖరీఫ్), యాసంగి(ర బీ) సీజన్‌లలో ఆరుతడి పంటలు తక్కువగా వేసుకొని, వరివైపు రైతు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. త క్కువ పెట్టుబడితో నీటి వినియోగ తక్కువ మోతాదుతో పండించే ఆరుతడి పంటల సాగుపై పూర్తిగా శ్రద్ధ పెట్ట డం లేదు. అందరూ వరి వైపు వెళ్లడంతో మిగిలిన పంటలకు అవకాశమున్నా..అవి తక్కువ విస్తీర్ణంలోనే సాగులోకి వస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభు త్వం క్రాప్ కాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టునున్నది.

జిల్లాలో...
జిల్లాలో ఇప్పటికే పసుపు ఆధారిత ఉత్పత్తుల కోసం నందిపేట్ మండలం లక్కంపల్లిలో సెజ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ. 150 కోట్లతో ఇది సర్వ హంగులతో ప్రారంభానికి ముస్తాబవుతున్నది. జిల్లాలో పసుపు పంటతో పాటు మొక్కజొన్న, సజ్జ, జొన్న, రాగులు తదితర పంటలకు అనుకూలమైన నేలలు ఉన్నాయి. వీటిని అధికంగా పండించి ఆహార ఉత్పత్తులకు ఈ పంట దిగుబడులను వినియోగించుకునే విధంగా పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో భాగంగా క్రాప్ కాలనీల ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధర లభించి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మెరుగుపడి, వ్యవసాయ రంగంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది.

ఏ పంటలు ఎక్కువ.. ఏ పంటలు తక్కువ..
జిల్లాలోని అన్ని పంటల సమాచారాన్ని సేకరించిన త ర్వాత రైతులు ఏ పంటల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు? ఏ పంటలు తక్కువగా సాగు చేస్తున్నారు అ నే విషయాల పై వ్యవసాయశాఖ లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తుంది. జిల్లాలో కూరగాయలు, నూనె గింజలు, జొన్న, పండ్ల సాగు తక్కువగా ఉంది. వీటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఆయిల్ సీడ్స్ కింద వేరుశనగ, కుసుమ, పొద్దు తిరుగుడు పంటలను ఎక్కువగా వేసుకునేందుకు రైతులకు ఆయా ప్రాంతా లు, నేల రకాన్ని బట్టి సలహాలిస్తారు. ఆ మేరకు క్రాప్ కాలనీలుగా విభజిస్తారు. వరి, మొక్కజొన్న పంటలు అవసరానికి మించి జిల్లాలో సాగవుతున్నట్లు అధికారు లు గుర్తించారు. ఈ సాగును క్రమబద్ధీకరిస్తారు. అవసరమైన మేర సాగుచేసుకునేలా అవగాహన కల్పిస్తారు.

నేడు సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన
కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ: మండల కేంద్రమైన కమ్మర్‌పల్లిలో పాటి హనుమాన్ ఆలయ క్షేత్రంలో నూ తనంగా నిర్మించిన సీతారామాలయంలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు జరుగుతాయని కమ్మర్‌పల్లి పాటి హనుమాన్ ఆలయ భక్తులు తెలిపారు. 15న ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 16న గ్రామోత్సవము, 17న యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఆధ్యాత్మికతకు నెలవు.. పాటి హనుమాన్ క్షేత్రం
కమ్మర్‌పల్లి శివారులో జాతీయ రహదారి సమీపానే ఉ న్న పాటి హనుమాన్ ఆలయ క్షేత్రం ఆధ్యాత్మికతకు నెలవుగా మారింది. పాటి హనుమాన్ ఆలయం కమ్మర్‌పల్లి ఊరు పుట్టనప్పటి నుంచి ఉన్నట్లుగా గ్రామస్తులు చెబుతారు. ఇటీవల కాలంలో ఆలయాన్ని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన వైద్యుడు శ్రీనివాస్, కమ్మర్‌పల్లికి చెందిన భక్తులు ఆలయాన్ని గణనీయంగా అభివృద్ధి చేశారు. ఆలయ మండపం, ధర్మశాల నిర్మించారు. ఆలయం వద్ద వసతులు కల్పించారు. నాలుగేండ్లుగా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు ఉన్న మార్గాన్ని ఇరు వైపులా మొక్కలు నాటి సంరక్షించారు. ఇప్పుడు అవి చెట్లుగా ఎదిగి ఆలయ మార్గానికి హరిత శోభను ఇస్తున్నాయి. పాటి హనుమాన్ భక్తుడు, కమ్మర్‌పల్లి మండల ఎంఈవోగా పని చేసి రిటైర్మెంట్ పొందిన మెట్‌పల్లికి చెందిన శ్రీరాముల రుక్మయ్య, ఆయన శిశ్యులు, పాటి హనుమాన్ భక్తులు, ఇతర భక్తులు విరాళాలు అందించి, సేకరించి ఈ క్షేత్రంలోనే రామాలయాన్ని నిర్మించారు. దీంతో పాటి హనుమాన్ ఆలయం మరింత ఆధ్మాత్మికతతో విలసిల్లనుంది.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...