కిటకిటలాడిన రామాలయాలు


Mon,April 15, 2019 02:17 AM

ఖలీల్‌వాడి : శ్రీరామనవమి పురస్కరించుకొని పట్టణంలోని రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడా యి. ఖిల్లా రాఘునాథ ఆలయం, సుభాష్‌నగర్ రామాలయం, హమల్‌వాడీ సాయిబాబా ఆల యం, కంఠేశ్వర్‌లోని తేనె సాయిబాబా ఆల యం, న్యాల్‌కల్ రోడ్డులోని రామాలయంలో రాములోరి కల్యాణోత్సవం ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. సుభాష్‌నగర్ రామాలయంలో ఉదయం నుంచి కార్యక్రమాలు కొనసా గాయి. జిల్లా జడ్జి సుగుణతో పాటు బిగాల కృష్ణమూర్తి దంపతులు పాల్గొన్నారు. ఖిల్లా రాఘునాథ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత దంపతులు పాల్గొన్నారు. బడా రాంమందిర్‌లో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి నగర మేయర్ ఆకుల సుజాత దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. జెండా బాలాజీ ఆలయంలో పు రోహితులు నాగరాజ ఆచార్యులు, వెం కటరమణచార్యులతో సీతారాముల క ల్యాణోత్సవం ఘనంగా నిర్వహించా రు. ఉదయం స్వామి వారికి విశేష పూ జలు చేశారు. సీతారాముల కల్యాణం చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యా రు. దీంతో ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల సౌకర్యార్ధం చలువ పందిర్లు వేశారు. వివిధ సేవా సంఘాల ఆధ్వర్యంలో భక్తు ల కోసం చల్లని నీటి వసతిని కల్పించారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...