కల్యాణ వైభోగమే..


Mon,April 15, 2019 02:17 AM

మెండోరా : మండలంలోని పోచంపాడ్ గ్రామ శ్రీకోదండ రామాలయంలో ఆదివారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర రోడ్లు భవనా లు, రవాణా, గృహనిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గ్గొన్నారు. మొదట ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కన్నుల పండువగా సాగిన సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం వేద పండితులు మంత్రి దంపతులను సన్మానించి ఆశీర్వదించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవాలకు వేలాది మంది భ క్తులు తరలివచ్చారు. వచ్చే ఏడాది మరిన్ని ఏర్పా ట్లు చేయాలని ఆలయ చైర్మన్‌కు మంత్రి సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పా ల్గ్గొని భక్తులకు వడ్డన చేశారు. ఆలయ చైర్మన్లు అనిల్‌బాబు, సాగర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్‌రెడ్డి,సామ వెంకటరెడ్డి, ఎంపీపీ అర్గుల రాధ చిన్నయ్య, సర్పంచ్ మిస్బావొద్దీన్, సర్పంచ్, ఉపసర్పచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సామగంగారెడ్డి, సంపంగి సతీశ్, సర్పంచ్‌లు గోలి ప్రకాశ్, శ్రీనివాస్, మాజీ ఎంపీపీ జక్కరాజేశ్వర్, జల్లా మైనార్టీ సెల్ జా యింట్ సెక్రటరీ ఎస్‌కే ఖాదర్, మండల అధ్యక్షు డు పాషా, మాజీ సర్పంచ్‌లు ముస్కు భూమేశ్వర్, నవీన్‌గౌడ్, తలారీ గంగాధర్, ఎంపీటీసీ బాబు, ప్రసాద్, నాయకులు నరహరి, గుర్ల ప్ర మోద్, సంజీవ్, మైలారం శ్రీనివాస్, పరమేశ్వర్, పవన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...