కల్యాణం.. కమనీయం


Mon,April 15, 2019 02:17 AM

కోటగిరి: మండలంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా కొనసాగాయి. మధ్యాహ్నం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య రాములోరి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. భక్తులు కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ఆలయాలకు రావడంతో కిటకిటలాడాయి. ఎక్లాస్‌పూర్, కోటగిరి, కొత్తపల్లి, అడ్కాస్‌పల్లి, కొల్లూర్ గ్రామాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల కమిటీ నిర్వాహకులు పోచారం సురేందర్‌రెడ్డిని సన్మానించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాస్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలి
ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని, నిత్యం కొంత సమయాన్ని భగవన్నామ స్మరణకు కేటాయించాలని గుడిమెట్ల మహాదేవ్ స్వామి అన్నారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం కొల్లూర్ గ్రామంలోని శ్రీగజానన్ మహరాజ్ మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఆలయం వద్ద అన్నదానం చేశారు. టీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...