అంబేద్కర్ ఆశయాలను సాధించాలి


Mon,April 15, 2019 02:16 AM

డిచ్‌పల్లి,నమస్తే తెలంగాణ: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆదివారం అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య పి.సాంబయ్య హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత, విద్యావంతులు, రాజకీయ నాయకులు అంబేద్కర్ ఆశయ సాధనకు పాటు పడాలని అన్నారు. ఇటీవల యూఎస్‌వో జరిపిన సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఐదుగురు మేధావుల్లో అంబేద్కర్ ఒకరని ధ్రువీకరించిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ జయంతిని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా జరుపుతున్నదన్నారు. ప్రపంచ దేశాలన్నీ దీని పాటిస్తున్నాయని, రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాలు బడుగు, బలహీన, దళిత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సమానత్వం కోసం తోడ్పాటును అందించాయని అన్నారు. సామాజిక వర్గ, వర్ణ విబేధాలు తొలగిపోవడానికి ఆయన అనేక ఉద్యమాలు నడిపాడని అన్నారు. ఈ ర్యక్రమంలో డాక్టర్ వి.త్రివేణి, పీరుబాయి, సురేశ్, బాబురాం, నరేందర్, మల్లిక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సౌత్ క్యాంపస్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి..
రాజంపేట్(సౌత్ క్యాంపస్): తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో అదివారం అంబేద్కర్ జయంతిని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విద్యార్థి నాయకులు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...