మూడు విడతల్లో పరిషత్ పోరు


Sun,April 14, 2019 01:36 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: త్వరలో స్థానిక ఎన్నికల సందడి ప్రారంభం కానున్నది. ఈనెల 22 నుంచి వచ్చే నెల 14 వరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థా నాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిం ది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆ మేరకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. జడ్పీపీటాన్ని జనరల్‌కు కేటాయించారు. కొత్తగా ఏర్పడిన మోస్రా, చందూర్ మండలాల ఎన్నికల విషయంలో ఇంకా తకరారు కొనసాగుతున్నది. వీటికి ఈ సారి ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేద ని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రిజర్వేషన్ ప్ర క్రియ చేస్తే జిల్లాలోని అన్ని రిజర్వేషన్లను మార్చాల్సి ఉం టుందని, ఇప్పటికే రిజర్వేషన్లపై గెజిట్ విడుదలైన నేపథ్యంలో మోస్రా, చందూర్ మండలాల ఎన్నికలు ఈ దఫా ఉండవనే అభిప్రాయానికి యంత్రాంగం వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా యి. నిజామాబాద్ పరిధిలో 25 జడ్పీటీసీ స్థానాలు, 299 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 22 జడ్పీటీసీ స్థానాలు, 233 ఎంపీటీసీ స్థానాలు ఉన్నా యి. ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు.

నిజామాబాద్ జిల్లాలో 7,79,112 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,63,267 మంది పురుష ఓటర్లు, 4,15,833 మంది మహిళా ఓటర్లు, 12 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. కా మారెడ్డి జిల్లాలో 6,02,752 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ జరగనున్నది. తొలి విడతలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో, రెండో విడతలో బోధన్, చివరి విడతలో ఆర్మూర్ పరిధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా అధికారు లు నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలో 1,589 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... కామారెడ్డి జిల్లాలో 1,294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై డ్రాప్ట్ పబ్లికేషన్ విడుదలైనప్పటికీ, ఈ నెల 20న తుది పబ్లికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాల పై స్పష్టత వస్తుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. బ్యాలెట్ బాక్సులు మండలాలకు పం పిణీ చేస్తున్నారు.

మొత్తం 3వేల పైన బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎన్నికలకు 2వేల బ్యాలెట్ బాక్సులు అవసరం పడతాయి. ఆర్మూర్, నందిపేట్, ఏర్గట్ల మండలాలు మినహా అన్ని మండలాలకు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు చేరాయి. కౌంటింగ్ ప్రక్రియకు ఇప్పటికే కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. నిజామాబాద్ డివిజన్ కౌంటింగ్‌ను నిర్మల హృదయ పాఠశాలలో, బోధన్ ఆర్కే ఇంజినీరింగ్ కాలేజ్, ఆర్మూర్ మునిపల్లి వద్ద గల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కామారెడ్డి జీవన్‌దాన్ హైస్కూల్, ఎల్లారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, బాన్సువాడలో రెండు పోలింగ్ కేంద్రాలు ఎన్‌కే కేడియా జూనియర్ కాలేజీతో పాటు మరో కౌంటింగ్ కేంద్రాన్ని ఎంచుకున్నారు. దాదాపు నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలకు 14వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో విధులను నిర్వహించనుండగా.. కామారెడ్డి జిల్లాలో 10వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. శిక్షణ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఈనెల 15న ఆర్మూర్‌లో ఎంపీటీసీ ఆర్వోలకు, ఏఆర్వోలకు, ఎంపీడీవోలకు ఉదయం 11గంటలకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 16న మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ పీవోలు, ఏపీవోలు, ఓపీవోలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తారు. 15న జడ్పీటీసీ ఆర్వో లు, ఎంపీటీసీ ఆర్వోలకు శిక్షణనివ్వనున్నారు. నలుగురు మాస్టర్ ట్రైనర్లతో పాటు జడ్పీ ఆఫీస్ సిబ్బంది, తదితరులు శిక్షణ కార్యక్రమానికి హాజరవుతారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు టెండర్లు నిర్వహించే ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత బ్యాలెట్ పత్రాల ముద్రణ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు టెండర్లు నిర్వహించి అందుకు సంసిద్ధంగా ఉండాలని ఏర్పాట్లు చేస్తున్నారు.

స్థానిక ఎన్నికలకు టీఆర్‌ఎస్ సన్నద్ధం...
స్థానిక పోరులో గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. జడ్పీపీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, పార్టీ ఆవిర్భావం తొలినాళ్లలోనే ఇందూరు జడ్పీపీఠంపై గులాబీ జెండా రెపరెపలాడింది. ఆనాటి నుంచి క్రమంగా ఇందూరు జిల్లా పూర్తిగా టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారిపోయింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ పాగా వేసింది. గ్రామ గ్రామానా గులాబీ జెండా ఎగరవేసింది. ఇదే తరహాలో స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు టీఆర్‌ఎస్ రెడీ అయ్యింది. ఈనెల 15న సీఎం కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, పార్టీ లీడర్లు పాల్గొననున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రజల వద్దకు వెళ్లి పార్టీ గెలుపునకు తీసుకోవాల్సిన చర్యల పై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...