మాసాయిపేట్ రోడ్డు ప్రమాదంలో బోధన్‌వాసి మృతి


Sun,April 14, 2019 01:34 AM

బోధన్, నమస్తే తెలంగాణ: మెదక్ జిల్లా మాసాయిపేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బోధన్ పట్టణం రాకాసిపేట్‌కు చెందిన రెడ్డిమాసు పున్న మ్మ (80) అనే వృద్ధురాలు మృతిచెందింది. బో ధన్ మండలం మీనార్‌పల్లి ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం చైర్మన్ తూమాటి చిన్న సుబ్బారావు, ఆయన సతీమణి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఘనటకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

తూమాటి చిన్న సుబ్బారావు కుమారుడు శుక్రవారం రాత్రి అమెరికాకు వెళుతుండగా.. వీడ్కోలు పలికేందుకు భార్య వెంకటరత్నమ్మ, అత్తమ్మ రెడ్డిమాసు పున్నమ్మతో కలిసి శంషాబా ద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. ఈ ముగ్గురు రాత్రి హైదరాబాద్‌లోనే సుబ్బారావు కూరు ఇంట్లో విశ్రాంతి తీసుకొని శనివారం ఉదయం కారులో బోధన్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఉద యం 8 గంటల ప్రాంతంలో మాసాయిపేట్ స మీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా.. వెంటనే చికిత్స కోసం హైదరాబాద్ సమీపంలోని సుచిత్ర వద్ద ఉన్న రష్ హాస్పటల్‌కు తరలించారు. రెడ్డిమాసు పున్నమ్మ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతిచెందింది. పున్నమ్మ కూతురు, అల్లుడు అక్కడే చికి త్స పొందుతున్నారు. రామాయంపేట్ ప్రభుత్వ దవాఖానలో పున్నమ్మ మృతదేహానికి పోస్టుమా ర్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

రాకాసిపేట్‌లో విషాదఛాయలు..
రెడ్డిమాసు పున్నమ్మది బోధన్ పట్టణంలో మంచి పేరున్న కుటుంబం. ఆమె భర్త వెంకటసుబ్బయ్య రెండు నెలల క్రితమే మరణించారు. పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ యజమానిగా, పట్టణంలోని రాకాసిపేట్‌లో ప్రముఖుడిగా ఆయనకు పేరుంది. శుక్రవారం జరిగిన దుర్ఘటనలో పున్నమ్మ మృతిచెందిందన్న వార్త తెలియడంతో రాకాసిపేట్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండు నెలల వ్యవధిలో భార్యాభర్తలు మరణించడంపై స్థానికులు కంటతడి పెట్టారు. పున్నమ్మ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

203
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...