నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు


Sun,April 14, 2019 01:34 AM

నిజామాబాద్ క్రైం : రాష్ట్ర విపత్తుల స్పందన,అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి జి.మురళీమనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రతలు, పాటించాల్సిన నియమాలు, ప్రమాదాల నుంచి తమను కాపాడుకునే జాగ్రతలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన వాల్‌పోస్టర్/కరపత్రాలను శనివారం కలెక్టర్ రామ్మోహన్‌రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రజలకు జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఈ పోస్టర్లను బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లతో పాటు రద్దీ ప్రదేశాలు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయనున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.ఈ అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణలో అదనపు అగ్నిమాపక శాఖ అధికారి భాను ప్రతాప్ తదితరులు పాల్గ్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల విజయవంతానికి అందరూ తమకు సహకరించాలని జిల్లా అగ్నిమాపక అధికారి మురళీ మనోహర్ రెడ్డి తెలిపారు.

వారోత్సవాల షెడ్యూల్...
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫైర్ సిబ్బందిని స్మరిస్త్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని మొదటి రోజు 14న జిల్లాకేంద్రంలోని అగ్నిమాపకశాఖ కార్యాలయంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. అమరులైన వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ సిబ్బందితో కార్యాలయంలో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తారు.
అగ్నిమాపక కార్యాలయ ఆవరణలో ఫైర్‌శాఖ ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలు,అగ్నిప్రమాదాలు సంభవించిన సమయంలో వారు చేసిన సాహాసాలకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ ప్రదర్శిస్తారు.
- అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ పరిధిలో సిబ్బందితో డెమోస్ట్రేషన్ నిర్వహణ ఉంటుంది.
- 15న ప్రధాన ప్రాంతాల్లో డెమోస్ట్రేషన్ కార్యక్రమాలు,పార్కులు/రైల్వే స్టేషన్/మార్కెట్/సినిమా థియేటర్/స్ల్లమ్ ఏరియాల్లో నిర్వహిస్తారు.
- 16న అపార్ట్‌మెంట్లలో అగ్నిప్రమాదాల సమయంలో ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి అనే అంశాలపై సూచనలు చేస్తారు. దీంతో పాటు ఎల్‌పీజీ గ్యాస్ వాడేందుకు ఎలాంటి జాగ్రతలు పాటించాలి, విద్యుత్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు.
- 17న అగ్నిప్రమాదాలపై మాక్‌డ్రిల్ నిర్వహిస్తారు. ఇండస్ట్రియల్ (ఫ్యాక్టరీ)ఏరియాలు/పెట్రోల్ బంక్‌లు/ఎల్‌పీజీ గోదాములు/వ్యాపార సముదాయాలు/భవనాల ఏరియాలు/ఫంక్షన్ హాల్స్‌లో నిర్వహిస్తారు.
- 18న విద్యాసంస్థలో ఫైర్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించి సూచనలు తెలియజేస్తారు.
- 19న దవాఖానల్లో అగ్నిప్రమాదలపై తీసుకొవల్సిన చిన్నపాటి జాగ్రతల పై అవగహన కార్యాక్రమాలు.
- 20న హోటల్‌లో అవగాహన కార్యక్రమం, వారం రోజుల్లో చేసిన కార్యక్రమాలను వెల్లడిస్తామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జి.మురళీ మనోహర్‌రెడ్డి తెలిపారు.

193
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...