ఎడపల్లిలో శ్రీరామ జన్మోత్సవం


Sun,April 14, 2019 01:33 AM

ఎడపల్లి: మండల కేంద్రంలోని శ్రీరామ మఠంలో శనివారం శ్రీరామ జన్మోత్సవం నిర్వహించారు. ఏటా శ్రీరామ నవమి ముందు రోజు ఎడపల్లి శ్రీరామ మఠం వంశస్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘ నంగా నిర్వహిస్తారు. ఇందులో భాగం గా భక్తి శ్రద్ధలతో బాలరాముడికి డోలా రోహణం చేపట్టారు. ఊయలలో బాలరాముడిని వేసి భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ జన్మోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంతానం లేని భక్తులు బాలరాముడిని ఒడిలోకి తీసుకుం టూ కల్లకద్దుకున్నారు. అలా చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వా సం. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మఠం లో ఆదివారం నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవానికి సభ్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల మాధవి, ఎంపీపీ రజిత, శ్రీరామ మఠం వంశస్తులు సురేశ్ ఆత్మారాం, జయరాం మహరాజ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...