గెలుపు ధీమాలో టీఆర్‌ఎస్ శ్రేణులు


Sat,April 13, 2019 06:15 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారుండి పోయారు. ప్రధానంగా టీఆర్‌ఎస్ శిబిరంలో విజయోత్సాహం కనిపిస్తున్నది. ప్రచార ప్రారంభం నుంచి ప్రజలతో మమేకమవుతూ దూకుడుగా టీఆర్‌ఎస్ శిబిరం ముందుకు సాగింది. ప్రత్యర్థులు టీఆర్‌ఎస్ ప్రచార వేగాన్ని అందుకోలేక పోయారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించి అన్నివర్గాలతో మమేకమయ్యారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా గులాబీ దళం ప్రచారంలో నిమగ్నమైంది. ఆయా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు కవిత గెలుపు కోసం విశేషంగా ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూనే జిల్లా ప్రచార సమన్వయ బాధ్యతలను పర్యవేక్షించారు. 2014లో మాదిరిగానే పోలింగ్ శాతం నమోదైంది. అప్పడు జమిలి ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం.. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నమోదు కావడం విశేషం. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఈవీఎంలు మొరాయించినప్పటికీ.. మహిళలు బారులు తీరి ఓపికగా క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు కోసం కవిత అన్నీ తానై వ్యవహరించారు. కాలికి బలపం కట్టుకొని తిరిగిన చందంగా అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు.

అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న ఇందూరు గడ్డకు మళ్లీ కవిత ఎంపీగా బరిలోకి దిగిన నేపథ్యంలో సబ్బండవర్ణాలు ఆమెకు మద్దతుగా నిలిచాయి. మహిళాలోకం వెన్నుతట్టి మేమున్నామంటూ భరోసానిచ్చింది. రూపాయి రూపాయి పోగేసి వేల రూపాయాలను ఎన్నికల ఖర్చుల కోసం విరాళాలుగా అందించారు. ఎర్రటి ఎండను లెక్క చేయకుండా అభ్యర్థి కవితతో పాటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మహ్మద్ షకీల్ రేయింబవళ్లు శ్రమించారు. అత్యధిక మెజార్టీ కవితకు వస్తుందనే ధీమాలో పార్టీ శ్రేణులు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్న చందంగా ఎక్కడా కనిపించక పోవడం, బీజేపీ అభ్యర్థి సైతం మారుమూల గ్రామాల వరకు ప్రచారాన్ని నిర్వహించలేక పోవడం, అన్ని వర్గాల ప్రజలు దరికి చేరలేకపోవడంతో సబ్బండవర్ణాలు టీఆర్‌ఎస్ వైపే నిలిచాయని పార్టీ శ్రేణులు అంచనాలు వేసుకుంటున్నాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తన నివాసంలో ముఖ్య నాయకులతో మాట్లాడారు. ఆర్మూర్, రూరల్, బోధన్ ఎమ్మెల్యేలు పోలింగ్ సరళిని అంచనా వేస్తూ మెజార్టీపై తమ అనుచరులతో సమాలోచనలు జరిపారు. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు శుక్రవారం రిలాక్స్ అయ్యారు. కాస్త సేద తీరారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఎంపీ అభ్యర్థి కవిత హైదరాబాద్‌లో తన నివాసంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.

ఎన్నికల సరళిపై నాయకులతో మంత్రి చర్చ
వేల్పూర్: మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం పోలింగ్ ముగియడంతో శుక్రవారం టీఆర్ ఎస్ కార్యకర్తతో ముచ్చటించారు. వేల్పూర్‌లో తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. ఎన్నికల సరళిపై వారితో చర్చించారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...