సత్తా చాటిన టీఆర్‌ఎస్


Sat,April 13, 2019 06:14 AM

నవీపేట: నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక జాతీయ పార్టీ మరో జాతీయ పార్టీకి ఓటు వేయించడం చూస్తే, జాతీయ పార్టీల దివాల కోరు తనం బయపట్టిందని టీఆర్‌ఎస్ నేతలు ఆర్.రాంకిషన్‌రావు, జిల్లా నాయకులు వి.మోహన్‌రెడ్డి, వి.నర్సింగ్‌రావు ఘాటు విమర్శలు చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో దాస్ గెస్టుహౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 11 నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తమ సత్తా చాటి చెప్పిందని అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి అధిక నిధులు తెచ్చి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభవృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించాలనే సంకల్పంతో పార్టీని బలోపేతం చేస్తూ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేందుకు కృషినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కవితకే ఓటు వేయడం అభినందనీయమని కొనియాడారు. జాతీయ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈ ప్రాంత ప్రజలు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపారని ఇందుకు పార్టీ కార్యకర్తలతో పాటు ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఎంపీగా కవిత భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు. ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించిన ముస్లింలకు ప్రత్యేక అభినందనలు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వి.మోహన్‌రెడ్డి, వి.నర్సింగ్‌రావు, భవంతి దేవిదాస్, ప్రభకర్‌రావు, మువ్వ నాగేశ్వర్‌రావు, న్యాలకంటి అబ్బన్న, కిశోర్‌రావు, బి.సూరిబాబు, అల్లం రమేశ్, మైనార్టీ నాయకులు అల్తఫొద్దీన్, ఉమర్, అలీమ్, ప్రదీప్‌రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...