ఎంపీగా కవిత ఘనవిజయం ఖాయం


Sat,April 13, 2019 06:13 AM

-రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ ఎంపీగా రెండోసారి కూడా అత్యధిక మెజార్టీతో కవిత ఘనవిజయం సాధించటం ఖాయమని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాస ప్రాంగణంలో టీఆర్‌ఎస్ అధ్యక్షులు, నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మండలాల వారిగా ఎంపీ ఎన్నికల్లో పోలైన ఓట్లు, టీఆర్‌ఎస్ అభ్యర్థి కవితకు అనుకూలంగా ఎన్ని ఓట్లు పడి ఉండవచ్చుననే అంచనాను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తరపున ఎంపీ అభ్యర్థికి 45వేల నుంచి 50వేల ఓట్ల మెజార్టీ రావటం ఖాయమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు, ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు కవిత విజయం కోసం కృషి చేసినందుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జిల్లా ఒలింపిక్‌సంఘం అధ్యక్షుడు గడీల రాములు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, రమేశ్‌నాయక్, ముస్కె సంతోష్, నట్ట భోజన్న, హన్మంత్‌రెడ్డి, రాజన్న, ముత్యంరెడ్డి తదితరులున్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...