పనులు వేగవంతం చేయాలి


Sat,April 13, 2019 06:13 AM

నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ వేల్పూర్: ఎన్నికల ఘట్టం ముగిసిన వెంటనే రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, రవాణా, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన బాధ్యతల్లో లీనమైపోయారు. నెల రోజుల పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజీగా బాధ్యతలు నిర్వర్తించిన మంత్రి.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే అభివృద్ధి పనులపై దృష్టిసారించారు. వేల్పూర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సాగునీటి పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. మిషన్ కాకతీయ పథకంలో చెరువుల పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మిషన్ కాకతీయలో ఎన్ని చెరువులు చేపట్టారు, పనుల ప్రగతి తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరో నెలన్నర కాలంలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని, వర్క్ ఏజెన్సీలతో సమావేశమై చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పనులు పూర్తిచేస్తే చెరువులు నిండి గ్రామాలు, రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 70 వేల ఎకరాలకు సాగునీటిని అందించే కాళేశ్వరం ప్యాకేజీ-21 పనులపై సమీక్షించారు. మోతె చెరువుకు నీటిని అందించే ఫీడర్ చానల్ పనులు తొందరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఏజెన్సీలతో పనులు త్వరితగతిన పూర్తి చేయించడంలో అలసత్వం పనికి రాదని సూచించారు. సమీక్షంలో ఈఈ రాధాకిషన్, డీఈ గోపినాథ్, ఏఈ సునిల్ తదితరులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...