పోలింగ్ శాతం @ 68.33


Sat,April 13, 2019 06:13 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లా ఓటర్లు తమ చైతన్యాన్ని చాటుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతమే దాదాపుగా ఈ ఎన్నికల్లో కూడా నమోదైంది. అప్పుడు జమిలి ఎన్నికల్లో పోలింగ్ కాస్త పెరిగిందని భావించారు. తాజాగా పార్లమెంట్‌కు మాత్రమే ఎన్నికలు జరిగినా.. 68.33 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. 2014లో 68.87 శాతం పోలింగ్ నమోదైంది. అప్పటితో పోల్చితే 0.54 శాతం మాత్రమే తక్కువ పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గత పోలింగ్‌తో సరిపోల్చితే.. జగిత్యాలలో 1.2 శాతం పోలింగ్ తక్కువగా నమోదైంది. బాల్కొండలో కూడా 1.65 శాతం తక్కువగా పోలింగ్ నమోదు కాగా.. అర్బన్‌లో 4.71 శాతం పోలింగ్ పెరిగింది. బోధన్ నియోజకవర్గంలో 3.61 శాతం తక్కువగా నమోదు కాగా.. నిజామాబాద్ రూరల్‌లో 0.45 శాతం తక్కువగా పోలింగ్ నమోదైంది. ఆర్మూర్‌లో 3.2 శాతం పోలింగ్ తక్కువ నమోదు కాగా.. కోరుట్లలో 0.5 శాతం గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో స్వల్పంగా నమోదు శాతం గతంలో కంటే తగ్గగా.. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్‌లో మాత్రం అనూహ్యంగా 4.71 శాతం పెరగడంతో నియోజకవర్గం మొత్తం 68.33 శాతానికి పోలింగ్ చేరింది.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...