ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం


Fri,April 12, 2019 01:48 AM

- మే 23న కౌంటింగ్
నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ప్రత్యేక పరిస్థితుల సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నాటి నుంచి ఈ ఎన్నిక పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో తగిన ఏర్పాట్లు చేసే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం యుద్ధప్రాతిపదికన స్పం దించి అనుకున్న సమయానికే ఎన్నిక నిర్వహించింది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఈవీఎంలను తెప్పించడం, కావాల్సిన సాం కేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, తక్కువ సమయంలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయడం తదితర చర్యలతో అనుకున్న సమయానికి నిజామాబాద్ లోక్‌సభకు ఎన్నిక నిర్వహించింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో పన్నెండు ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. చెదురుమదురు ఘటనలు మినహా గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అభ్యర్థుల భవిత్యవం మే 23న తేలనున్నది. ఈవీఎంలను డిచ్‌పల్లిలోని సీఎంసీలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ఈ మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ని అవాంతరాలు అడ్డొచ్చినా నిర్దేశిత సమయానికి పోలింగ్ నిర్వహించి కీలకమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయగలిగారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జిల్లాలో కొనసాగుతున్న ఏర్పాట్ల పై పర్యవేక్షణ చేసింది. ఇక్కడి పరిస్థితులు పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ సైతం జిల్లాకు వచ్చి దిశానిర్దేశం చేశారు. చిన్నచిన్న అవాంతరాలు మినహా సజావుగా ఎన్నిక జరిగింది. వచ్చే నెల 23న ఓటరు తీర్పు వెలువడనున్నది. దండలెవరికో.. దండనెవరికో తేలనున్నది. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ప్ర చారం బిజీబిజీగా గడిపిన అభ్యర్థులు ఎన్నికలు ముగిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నా రు. అయితే ఫలితాల వరకు ఆసక్తి అలాగే కొనసాగునున్నది.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...