అందరికీ థ్యాంక్స్..


Fri,April 12, 2019 01:47 AM

- ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంపై కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్
నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఈ యజ్ఞంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎం. రామ్మోహన్‌రావు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. గురువారం ఆయ న ఎన్నికల సరళిని కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్ నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఇబ్బందులు ఎదురైన ప్రాం తాల్లో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ స మస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించడం, ఆలస్యంగా ప్రా రంభమైన పోలింగ్ కేంద్రాలకు సంబంధిత సెక్టార్ అధికారులను, ప్రిసైడింగ్ అధికారులను, ఏఆర్‌వోలను సమాయ త్తం చేసి ఆ సమస్యలను పరిష్కరించి పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ఇంత పెద్ద క్రతువులో చిన్న చిన్న సమస్యలు సంభవించినప్పటికీ.. ఇంజినీర్లు, అధికారులను పంపించి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నిలు ప్రశాంతంగా ముగిశాయని, ఏ పోలింగ్ కేంద్రంలోనూ రీపోలింగ్‌కు డిమాండ్ రాలేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఒక్కో పోలింగ్ బూత్‌లో 12 బ్యాలెట్ యూనిట్లతో భారీ గా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద నీడ కోసం టెంట్లు, తాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచి ఎలాంటి ఇబ్బందు లు లేకుండా చూశామనన్నారు. సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టి సజావుగా ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థా యిలో ప్రతి ఒక్కరూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసినందు కు చాలా సంతోషంగా ఉందని రిటర్నింగ్ అధికారి రామ్మోహన్‌రావు తెలిపారు. ఈ విధులను ఒక యజ్ఞంగా భావించి అంకితభావంతో, బాధ్యతాయుతంగా పని చేసినందుకే చరిత్రాత్మక ఎన్నిక ప్రక్రియ విజయవంతంగా ముగిసిందన్నారు. ఈ క్రతువులో కొన్ని రోజులుగా శ్రమించిన ఉద్యోగులు, అధికారులకు, సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మరోవైపు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు, ఓటర్లు, ప్రసార మాధ్యమాలు, పత్రికలు పూర్తి సహకారం అందించడంతోనే ఈ రికార్డును సంపూర్ణంగా పూర్తి చేయడంలో కృతకృత్యులమైనట్లు తెలిపారు. ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్‌ను పరిశీలించి వివరాల సేకరణపై సిబ్బందికి ఆయన తగిన ఆదేశాలు జారీ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ, జగిత్యాల జేఎన్‌టీయూ, ఇంజినీరింగ్ పీజీ కళాశాలల నుంచి 150 మంది విద్యార్థులు వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్‌లతో పోలింగ్ సరళిని రికార్డు చేశారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...