ఘనంగా జ్యోతిబా ఫూలే జయంతి


Fri,April 12, 2019 01:46 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ/ ఆర్మూర్ రూరల్: నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఆయన చిత్రపటానికి, విగ్రహానికి కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆర్మూర్‌లోని విద్యుత్ డివిజన్ కార్యాలయంలో, ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఫూలే జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ డీఈ రమేశ్, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు పింజ అశోక్, టీఎంసీ ఉదయశ్రీ, హేమలత, వెంకటేశ్, ఆర్పీలు సత్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మగ్గిడిలో జ్యోతిబా ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సయ్య, ఫూలే అంబేద్కర్ యూత్ సభ్యులు సంతోష్, సతీశ్, మోహన్, రాకేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు. మామిడిపల్లిలోని రజక సంఘంలో జ్యోతిబా ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మానస గణేశ్, పట్టణ అధ్యక్షుడు శంకర్, శ్రావణ్, శ్రీనివాస్, విజయ్, చాగంటి శ్రీనివాస్, నాని, రాజు తదితరులు పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
బాల్కొండ/ భీమ్‌గల్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతిని గురువారం బాల్కొండ, భీమ్‌గల్ మండలాల్లో ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఫూలే విగ్రహానికి సర్పంచ్ మానేటి తులసి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మానేటి నాగభూషణం, సంఘం నాయకులు మల్లయ్య పాల్గొన్నారు. భీమ్‌గల్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు గట్టు మాణిక్యం, పర్శ అనంత్‌రావు, గుర్రపు రాజేశ్వర్, రాజేశ్వర్, పీరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...