సంకన సద్ది.. చేతిలో జెండా


Wed,March 20, 2019 02:24 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: చైతన్యానికి ప్రతీకగా ఉన్న ఇందూరు ప్రజానీకం నాటి ఉద్యమ స్ఫూర్తిని కనబరిచి సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసింది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్నం రెండు గంటలకు నుంచే నాయకులు ఏర్పాటు చేసిన వివిధ వాహనాల్లో సభకు తరలివచ్చారు. జబ్బకు జెండా.. చేతిలో సద్ది పెట్టుకుని నాటి ఉద్యమ రోజులను గుర్తు చేస్తూ ఎంతో ఉత్సాహంగా సభకు వచ్చారు. వాహనాలు మధ్యలో నిలుపుకొని ఎండకు కాసేపు చెట్టునీడ సేదతీరుతూనే తెచ్చుకున్న సద్దిని ఆరగించారు. మరికొందరు అక్కడే వంటా వార్పు నిర్వహించుకొని క్షుద్బాద తీర్చుకొని సభకు తరలివచ్చారు. పండుగ వాతావరణంలో సంబురంగా కేసీఆర్ సభకు వచ్చి ఎంతో ఉత్సాహంగా ఆయన కోసం ఎదురుచూశారు. ఆయన రాక కొంత ఆలస్యమైనా ఓపికగా కళాకారుల ఆటపాటకు లయబద్ధంగా ఆడుతూ ఆనందపరవశంలో మునిగిపోయారు. కేసీఆర్ ప్రసంగాన్ని ఆసాంతం ఎంతో ఆసక్తిగా ఆలకించిన ఇందూరు జనం ఆయన ప్రతి పంచ్ డైలాగ్‌కు స్పందించారు. ఆయన వేసిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానిలిచ్చారు. కేసీఆర్ కేంద్రంపై వ్యంగ్యాస్ర్తాలు సభికులను ఆకట్టుకున్నాయి. కడుపుబ్బా నవ్వించాయి. అదే రీతిలో వారి నుంచి స్పందన వచ్చింది. కేరింతలతో కేసీఆర్ అభిప్రాయాలతో జనం ఏకీభవించారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...