సీఎం సభకు భారీ భద్రత


Wed,March 20, 2019 02:23 AM

నిజామాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పీఎస్‌వో (పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) ఆధ్వర్యంలో 20 మంది డీఎస్పీలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి సిబ్బంది సభ ప్రాంగణానికి ముందుగానే చేరుకున్నారు. సోమవారం సాయంత్రమే పోలీసులు సభా స్థలిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ వెస్టుజోన్ ఐజీ స్టిఫెన్ రవీంద్ర భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిజామాబాద్ రేంజ్ డీఐజీ ఎన్.శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయతోపాటు సిద్దిపేట్ ఎస్పీ నోయల్ డేవిడ్, అదనపు డీసీపీ, అడిషనల్ ఎస్పీలు, ఏసీపీలు, డీఎస్పీలు మొదలుకొని కానిస్టేబుల్ క్యాడర్ వరకు 2,642 మంది బందోబస్తులో పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ బలగాలు సైతం బందోస్తులో నిమగ్నమయ్యాయి. బాంబు డిస్పోజల్, డాగ్ స్కాడ్ బృందాలు సభా ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించాయి. సభా ప్రాంగణం చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పాటు రూఫ్ టాప్ నిఘా (బైనాక్యూలర్)ద్వారా పర్యవేక్షణ నిర్వహించారు. సివిల్ బలగాలతో పాటు స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచ్, సెంట్రల్ క్రైం స్టేషన్ సిబ్బంది ప్రత్యేక నిఘా వ్యవస్థను అమలు చేశాయి. వీరితో పాటు మాఫ్టీ బలగాలు సైత బందోబస్తులో పాల్గొన్నారు. బందోబస్తు చర్యలను డీఐజీ శివశంకర్ రెడ్డి, నిజామాబాద్ సీపీ కార్తికేయ పర్యవేక్షించారు. బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలను మెటల్ డిటెక్టర్ల ద్వారాల గుండా లోనికి అనుమతించారు.

సెంట్రల్ ఫోర్స్‌తో పికేట్
నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు, కంఠేశ్వర్ చౌరస్తా, గౌతంనగర్ చౌరస్తా, జిల్లా పరిషత్ చౌరస్తా, ధర్నా చౌక్, జిల్లా కోర్టు చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా, వినాయక్‌నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ చౌరస్తాతో పాటు ఇతర ప్రధాన ప్రాంతాల్లో సెంట్రల్ రిజర్వు బలగాలతో పికేట్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కంఠేశ్వర్ ఆర్మూర్ రోడ్డు, బైపాస్ రోడ్డు అర్సపల్లి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. వేల సంఖ్యలో వచ్చిన వాహనాలను నిలిపేందుకు కంఠేశ్వర్, గంగాస్థాన్, కాలూర్ రోడ్డు, అర్సపల్లి ప్రాంతాల్లో పార్కింగ్ జోన్‌లను ఏర్పాటు చేశారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...