టీఆర్‌ఎస్ బలపర్చిన చంద్రశేఖర్‌గౌడ్‌ను గెలిపిద్దాం


Wed,March 20, 2019 02:22 AM

-టీఆర్‌ఎస్ బలపర్చిన చంద్రశేఖర్‌గౌడ్‌ను గెలిపిద్దాం
బోధన్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యమంలో ముందున్న తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ను సీఎం కేసీఆర్ బలపర్చి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలో నిలిపారని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు బి.కమలాకర్ తెలిపారు. పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటు చంద్రశేఖర్‌గౌడ్‌కు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి కల్యాణ మండపంలో చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతుగా పీఆర్టీయూ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కమలాకర్ హాజరై మాట్లాడారు. చంద్రశేఖర్ లాంటి ఉన్నత విద్యావంతుడు, నిజాయితీపరుడు, ఆలోచనాపరుడిని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగుల ప్రతినిధిగా వారి సమస్యలపై శాసనమండలిలో గళం వినిపిస్తారని అనానరు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా చంద్రశేఖర్‌గౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘోత్తమ్‌రెడ్డి గెలుపు ఖాయమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఇటీవలి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిరుద్యోగభృతి కోసం రూ.2వేల కోట్ల రూపాయలను సీఎం కేటాయించారని అన్నారు. మొత్తం పట్టభద్రుల్లో కేవలం 33 శాతం మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి వంద శాతం నమోదుచేసుకోవాలని కోరారు.

ప్రజా సేవకోసం ఉన్నత పదవుల త్యాగం..
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇల్తెపు శంకర్ మాట్లాడుతూ.. చంద్రశేఖర్‌గౌడ్ కలెక్టర్ కావాల్సిన వ్యక్తని, ప్రజా సేవా కోసం తన 12 సంవత్సరాల ఉన్నత సర్వీస్‌ను వదులుకొని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేశారని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సమస్యలపై చక్కటి అవగాహన ఉందన్నారు. చంద్రశేఖర్‌గౌడ్ తండ్రి రామాగౌడ్ కవిగా అందరికీ సురిచితుడని, ఉపాధ్యాయుడిగా పనిచేశారని గుర్తు చేశారు. పట్టభద్రుల భవిష్యత్తును కాపాండేందుకు చంద్రశేఖర్‌గౌడ్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఆత్మీయ సమ్మేళనంలో పీఆర్టీయూ బోధన్ మండల అధ్యక్షుడు ఎంబెల్లి శంకర్, కోటగిరి మండల అధ్యక్షుడు శానం సాయిలు, బోధన్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల ప్రతినిధులు కొడాలి కిశోర్, పూదోట జయప్రకాష్, సురేశ్, ఐఆర్ చక్రవర్తి, పీఆర్టీయూ ప్రతినిధులు నాగనాథ్, హన్మంత్, సాయిలు, విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...