అంగన్‌వాడీ కేంద్రాలతోనే పౌష్ఠికాహారం


Wed,March 20, 2019 02:20 AM

కోటగిరి/రెంజల్/రుద్రూర్ : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారానే సంపూర్ణ పౌష్ఠికాహారం అందుతోందని అంగన్‌వాడీ టీచరు కట్టు కృష్ణకుమారి అన్నారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు, బాలింతలకు పౌష్ఠికాహారంపై అవగాహన కల్పించారు. పౌష్ఠికాహారం తీసుకోవడంతో కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. పౌష్ఠికాహారంతోనే బలమైన, ఆరోగ్యవంతమైన శిశువులు జన్మిస్తారని అన్నారు. పక్షోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సీ మంతాలు చేస్తున్నారని అన్నారు. అంగన్‌వాడీ టీచ ర్లు కృష్ణకుమారి, జమున, గర్భిణులు, బాలింతులు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సూపర్‌వైజర్ ప్రమీలారాణి, అంగన్‌వాడీ టీచర్లు సురేఖ, పిల్లల తల్లు లు ఇతరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో పోషణ పక్వాడా
రుద్రూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలు ర ఉన్నత పాఠశాలలో ఆహార సాంకేతిక, పరిజ్ఞాణ క ళాశాల ఆధ్వర్యంలో మంగళవారం పోషణ పక్వా డా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ కా ర్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆహార పోషణ గురించి, రక్తహీనతను నివారించే విధానాల గురిం చి ప్రొఫెసర్ ప్రశాంతిమేధా వివరించి చెప్పారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అమ ల, ఏవో లీనా, శ్రీలత, విద్యార్థులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...