గుర్తింపు కార్డులతోనే ఓటు హక్కు కల్పించాలి


Tue,March 19, 2019 03:04 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులతోనే ఓటు హక్కు కల్పించాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఆర్మూర్ డివిజన్ కోఆర్డినేటర్ చతుర్వేది అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలోని యాల్ల రాములు స్మారక సమావేశ మందిరంలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న పీవో, ఏపీవో, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చతుర్వేది మాట్లాడుతూ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండవద్దని, బాధ్యతతో పనిచేయాలన్నారు. ఈ నెల 21వ తేదీన ఎన్నికల సిబ్బంది ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయానికి ఉదయం 11 గంటలకు చేరుకొని రూట్‌ల వారీగా పోలింగ్ సామగ్రిని తీసుకొని వెళ్లాలన్నారు. 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నిక జరుగుతుందన్నారు. అనంతరం ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రిని తీసుకొని రూట్ల వారీగా ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎంపీడీవో టీవీఏస్ గోపిబాబు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...