నీటిని అందించి పంటలను కాపాడుతాం


Tue,March 19, 2019 03:04 AM

కోటగిరి : నల్ల చెరువు ఆయకట్టు కింద ఉన్న పంటలకు నీటిని అందించి పంటలను కాపాడి, రైతులను ఆదుకుంటామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు నియోజకవర్గ నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. నల్ల చెరువు ఆయకట్టు రైతులు సాగు చేసిన పంటలకు నీరు లేక ఎండిపోతున్నాయని నల్ల చెరువు నుంచి నీటిని విడుదల చే సి పంటను కాపాడాలని నాలుగు రోజులక్రితం రైతులు కోరడంతో పోచారం సురేందర్‌రెడ్డి వెంటనే స్పందించి సంబంధిత శాఖ అధికారులతో మా ట్లాడి నల్ల చెరువు నుంచి నీటిని అందించేందుకు కృషి చేశారు. సోమవారం మధ్యాహ్నం తహసీల్దార్ శ్రీ నివాసరెడ్డి, ఆర్‌ఐ నజీర్, స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్ చెరువు వద్దకు వెళ్లి మత్స్య కార్మికులకు, ఆయకట్టు రైతులకు మాట్లాడారు. చెరువులో ఆరు ఫీట్ల నీరు నిల్వ ఉందని ఇందులో నుంచి రెండు ఫీట్ల నీరు విడుదల చేస్తామని, పంటలకు అందిస్తామని తెలిపారు. రైతుల సంక్షేమ కోసం పోచారం సు రేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని డివిజన్ స్థాయి అధికారితో మాట్లాడి నల్ల చెరువు నుంచి నీ టిని విడుదల చేయించారు. దీంతో ఆయకట్టు రై తులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ శంకర్‌పటేల్, కొల్లూర్ కిశోర్, కూచి సిద్దూ, అరుణ్‌గౌడ్, రాంరెడ్డి, లింగప్ప, రైతు లు తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...